సాలూరు కి చెందిన వీరాభిమాని కాళ్ల తనోజ్ కుమార్ పై అభిమానాన్ని కురిపించిన నందమూరి నటసింహం బాలయ్య బాబు..
నందమూరి నటసింహం బాలయ్య బాబు కు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడతారు. అభిమానుల్ని సొంత మనుషుల్లా చూసుకునే మంచి మనసు ఆయన సొంతం. సాలూరు టౌన్ 6వ వార్డుకు చెందిన బాలయ్య వీరాభిమాని చేతి మీద వాళ్ళ జై బాలయ్య అంటూ టాటూ కూడా వేసుకున్న వీరాభిమాని కాళ్ల తనోజ్ కుమార్ కు
శనివారం ఉదయం కుమార్తె జన్మించింది. శనివారం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషాలకు హీరో బాలకృష్ణ నెంబర్ కు పాప పుట్టింది సార్ అని వాట్సప్ మెసేజ్ చేశారు. 9 గంటల 41 నిమిషాలకు గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలయ్య బాబు ఫోన్ చేసి పిల్లా తల్లి క్షేమమేనా అంటూ యోగక్షేమాలు కనుక్కున్నారని ఈ విషయమై తాను అలౌకికమైన ఆనందానికి లోనయ్యానని.... బాలయ్య బాబుని కలవడానికి మాట్లాడ్డానికి ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన తనకు ఇవి ఎంతో ఆనంద క్షణాలని తన ఆరాధ్య నటుడు బాలకృష్ణను 4 సార్లు కలిసినట్టు తొలిసారి 2011 నవంబర్ లో లయన్ సినిమా చిత్రీకరణ సమయంలో, తదుపరి 2019 ఎన్నికల ప్రచారం కొరకు సాలూరు వచ్చినప్పుడు తరువాత హైదరాబాదులో ఒకసారి ఇంకా అఖండ 2 చత్రం షూటింగ్ సమయంలో మరొకసారి కలిసినట్టు తెలిపారు.