పిట్లంలో జ్యోతిరావు ఫూలే జయంతివేడుకలు
కామారెడ్డి జిల్లా( ప్రతినిధి మస్నాజీ ), పిట్లంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు వక్తలు, ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కుల సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగులు పాల్గొన్నారు