నూతన ఎస్సైగా ఆంజనేయులు బాధ్యతలు: బిజెపి నాయకుల శుభాకాంక్షలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో నూతన ఎస్సైగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, శుక్రవారం పిట్లం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు గుండ సాయి రెడ్డి, బిజెపి నాయకులు ఎస్సై ఆంజనేయులును కలిసి పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. పిట్లం మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని బిజెపి నాయకులు ఎస్సైని కోరారు.