logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అప్పనపల్లి బాధితులకు జనసేన అండ - పరామర్శించిన ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం అప్పనపల్లి గ్రామంలో పొలం వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి,సోదరుడు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, శనివారం పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు.గ్రామంలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి రుద్రవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సిరివెళ్ల సీఐ బి. రాము, రుద్రవరం ఎస్ఐ జయప్పలతో భేటీ అయ్యారు. అసలు గొడవ ఎలా మొదలైంది. అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ వివాదంలో గాయపడిన వారిని, ఇబ్బందులకు గురైన బాధితులను ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి స్వయంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ. మేము మీకు అండగా ఉంటాం, ఎవరూ అధైర్యపడకండి అని ధైర్యం చెప్పారు. న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరపున పోరాడతామని వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఇటువంటి ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఘటనకు కారణమైన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలి.పోలీసులు ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి.అప్పనపల్లిలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని కోరారు .ఈ పర్యటనలో ఇరిగెల సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

92
2738 views

Comment