logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెట్రోల్ బంక్ ఉద్యోగినిపైకి దూసుకెళ్లిన జీపు!

జర్నలిస్టు : మాకోటి మహేష్
తమిళనాడు బిదర్‌కాడ్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపైకి వేగంగా వచ్చిన జీపు దూసుకెళ్లింది. డ్రైవర్ బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ నొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తన పనిలో నిమగ్నమై ఉన్న సదరు మహిళకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటన రోడ్డుపై పనిచేసే కార్మికుల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. ఇతరులు చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు వస్తుందని, వర్కర్ల సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు అవసరమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

8
68 views

Comment