తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రైవేట్ ఆర్టీసీ లక్జరీ బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి..
జర్నలిస్టు: మాకోటి మహేష్
పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా గాయాలపాలు కావడం జరుగుతూనే ఉంది..
తాజాగా తెలంగాణలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది..!
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..!
హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..!
బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా..అందులో 16మంది గాయపడినట్లు సమాచారం..!
వారిని స్థానిక కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు..!
బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు..!