logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఫ్రెండ్స్ వెల్ఫెర్అసోసియేషన్. మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి ఉత్సవాలు...........

తేది,11-04-2026 : శేరిలింగంపల్లి చందానగర్: మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అనగా శనివారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూల మాలాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పండ్లు. పెన్నులు పుస్తకాలు పెన్సిల్స్ వివిధ స్టేషనరీస్ అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ గారు మాట్లాడుతూ... పూలే సామాజిక తత్త్వవేత్త. ఉద్యమ కారుడు సంఘ సేవకుడు అని అన్నారు. మనుషులు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే,కేవలం విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. దేశంలోని బహుజనులకు, మహిళలకు విద్యను ప్రోత్సహించినపుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని భావించి, వారి అభ్యున్నతికై కృషి చేసిన మహోన్నతుడు పూలే అన్నారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే బాలికల విద్యకోసం కృషి చేసిన మొదటి మహిళా అధ్యాపకురాలు. భార్యను సమాజ చైతన్యానికి అంకితం చేసిన ఘనత అయనదే. తొలి బాలికా పాఠశాలను స్థాపించిన ఘనత పూలేకే దక్కింది. వితంతు వివాహాలను ప్రోత్సహించి,బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. ముఖ్యంగా అనాధ బాలల కోసం, వితంతు స్త్రీలకోసం అనాధ ఆశ్రమాలను నెలకొల్పిన మానవతా వాది పూలే. సమానత్వం స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన కోరిక. సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారత దేశానికి చాలా అవసరమనే సందేశాన్ని అందించిన మహాత్మా పూలే నాకు గురువని అంబేడ్కర్ అన్నారు. తన రచనలద్వారా సమాజాన్ని చైతన్య పరిచిన గొప్ప ఉద్యమ కారుడని కొనియాడారు. స్త్రీ విద్య. దళిత. బహుజనుల అభ్యున్నతికోసం, కుల వివక్ష నిర్మూలనకోసం, తమ జీవితాలను అంకితం చేసిన పుణ్య దంపతులని కొనియాడారు. నేటి యువత వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని బహుజనుల సర్వతోముఖాభివృద్ధికై కృషి చేయడమే మనం వారికి అర్పించే నిజమైన నివాళులు అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మెర్సీ, ఉపాధ్యాయురాలు శోభ, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మల్లేష్, కొక్కుల జనార్దన్, అమ్మయ్య చౌదరి,శివరామకృష్ణ,చంద్రశేఖర్, సింగారయ్య . తదితరులు పాల్గొన్నారు.

20
2242 views

Comment