logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆదర్శంగా నిలిచిన జెడ్ పి ఎస్ ఎస్ పూర్వ విద్యార్థులు

రుద్రంపూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ 1984-1985 మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు, వారి తల్లి దండ్రులు మరియు గ్రామ పెద్ద లైన పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు,సింగరేణి కంపెనీ సహాయ సహాకారాలతో అప్పటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల మార్గ నిర్దేశకత్వంలో 7వ తరగతి వరకు వున్న ఆ పాఠశాలను 10వ తరగతి వరకు హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేయుటకు అందరు కలసి ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి హై స్కూల్ యొక్క అవసరాన్ని విన్నవించడం ద్వారా 1984-85 సంవత్సరం లో జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ గా అప్ గ్రేడ్ అయినది.
1984 85 మొదటి బ్యాచ్ ఉత్తమ ఫలితాలు ఇవ్వడం అయినది ఈ బ్యాచ్ లో మెరిట్ స్టూడెంట్ గా ఉన్న శ్రీ లింగాల మల్లయ్య కుమారుడుడైనా భాస్కర్ రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో 26వ ర్యాంకు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చినాడు. పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలలో ఉద్యోగములు చేయుచున్నారు. లింగాల భాస్కర్ సింగరేణి బెల్లంపల్లి ఏరియా లో అడిషనల్ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. దురదృష్టవషాత్తు అనారోగ్య కారణములతో ఇంకా సర్వీస్ ఉండగానే 7 feb 2026 దివంగతులైనాడు.
ఈ సందర్భములో బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి అతని జ్ఞాపకార్థము వారు చదివిన రుద్రంపూర్ పాఠశాలకు మార్చ్ ఫాస్ట్ బ్యాండ్ పార్టీ పరికరములను, బ్యాండ్ యూనిఫామ్ ను ఈ రోజు అందజేయడం జరిగినది.అనంతరం పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమములో పూర్వ విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, స్కూల్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మరియు భాస్కర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చివరగాఅందరు భాస్కర్ చిత్ర పటానికి నివాళులు నిర్వహించడం ద్వారా కార్యక్రమం ముగిసినది.
ఇట్లు
పూర్వ విద్యార్థులు
1984-85 మొదటి బ్యాచ్.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు మాజీ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రావు, రుద్రంపూర్ హెచ్ ఎం బాలాజీ, స్కూల్ స్టాఫ్ లక్ష్మి, కవిత,గ్రామ పెద్దలు ఎండీ రజాక్, యాకయ్య,పూర్వ విద్యార్థులుసలిగంటి శ్రీనివాస్,చిలక రాజయ్య, షమీమ్ సుల్తాన, సుగుణ,త్రివేణి,ఆంజనేయులు, జి. శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్, రమేష్, సత్తి రెడ్డి, చంద్ర శేఖర్, శాంతికుమార్, నాగరాజు,నీలం వెంకటేశ్వర్లు. భాస్కర్ సతీమణి సరస్వతి,పద్మ,పిల్లలు, ఆమెని, సాయి, గోపి,భాస్కర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

14
1373 views

Comment