కడప నగరంలో ఎస్పీ ఆదేశాల మేరకు చిన్న చౌక్ఆధ్వర్యంలో తనిఖీలు
కడప జిల్లా కడప నగరంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నచౌక్ సీఐ ఓబులేష్ యాదవ్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులతో మాట్లాడిన సీఐ ఓబులేష్ యాదవ్, తమ సామాను పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.