*వైద్య సహాయ నిమిత్తం ఏ పేద కుటుంబం* *అధైర్య పడవద్దు అండగా* *ఉంటాను--ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు
*వైద్య సహాయ నిమిత్తం ఏ పేద కుటుంబం* *అధైర్య పడవద్దు అండగా* *ఉంటాను--ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు*
*నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు* *సీఎంఆర్ఎఫ్ కొండంత* *భరోసా ---ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు*
*పలు పేద కుటుంబాలకు ఇంటి వద్దకు వెళ్లి CMRF చెక్కులు* *అందించిన పొందూరు మాజీ* *ఎంపీపీ కూన ప్రమీల గారు*
అమదాలవలస నియోజకవర్గoలో బూర్జ సరుబుజ్జిలి ఆమదాలవలస మండలాలకు సంబంధించిన గ్రామాలులో ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చులు నిమిత్తం చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయంగా వారి కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి వచ్చిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కులను ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ *కూన రవికుమార్* గారి సతీమణి పొందూరు మండల మాజీ ఎంపీపీ *శ్రీమతి కూన ప్రమీలా* మేడం గారు స్వయంగా లబ్ధిదారులు కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని లబ్దిదారులకి చెక్కులు ఇవ్వడం జరిగినది.
*లబ్ధిదారుల* *వివరాలు*
1. పొట్నూరు శ్రీనివాసరావు-- 114000 మెట్టెక్కివలస
2. గొర్ల మహేశ్వరరావు--117000 దన్నానపేట
3. రెడ్డి అప్పల నరసమ్మ--67000 చిన్న జొన్నవలస
4. పొట్నూరు శివ సాయి--60000 కలివరం
5. కూటికుప్పల మౌనిక--300000 బప్పడం
6. సైలాడ మణికంఠ--63000 అన్నం పేట
7. కొన్ని ఎర్రయ్య--100000 సింధు వాడ
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే కూన రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు వలే ఆదుకుంటున్నారని శ్రీమతి కూన ప్రమీలా గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-------
టీడీపీ కార్యాలయం
ఆమదాలవలస