వయోవృద్ధులను పట్టించుకోకుంటే కటకటాలే..!
జర్నలిస్ట్: ఆకుల గణేష్
తల్లిదండ్రులు భారం కాదు బాధ్యత అని, వృద్ధాప్యంలో వారిని మానసికంగా హింసిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్-2007 ప్రకారం కఠిన చర్యలు తప్పవని మొగుళ్ళపల్లి ఎస్సై సురేష్ తెలిపారు. తనను పట్టించుకోకుండా, కనీసం కడుపునిండా తిండి కూడా పెట్టడం లేదని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలు మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇద్దరు కొడుకులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఎస్సైకి తన దీనస్థితిని వివరించింది.