logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భూపాలపల్లి కలెక్టరేట్‌లో రైతుల ఆందోళన

జర్నలిస్ట్: ఆకుల గణేష్

భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో సోమవారం సుమారు 70 మంది రైతులు ధాన్యం బోనస్ డబ్బులు చెల్లించాలని ఆందోళన చేపట్టారు. ప్రజావాణికి హాజరైన రైతులు కలెక్టర్ రాహుల్ శర్మతో బోనస్ జాప్యంపై వాగ్వివాదానికి దిగి, కలెక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాటారం, మల్హర్ మండలాలకు చెందిన సుమారు 2000 మంది రైతులకు బోనస్ ఇంకా అందలేదని, ఫిబ్రవరి మొదటివారం నుండి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఏపీజీవీబీ బ్యాంకు సమస్య ఉందని అధికారులు చెబుతూ దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి అనంతరం సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

0
25 views

Comment