రేపాక హత్య కేసు ఛేదన.. కుమారులే తండ్రి హత్య చేసారు
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపాక గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. కుర్ర చేరాలు (55) అనే వ్యక్తిని అతని కుమారులు రామ్, లక్ష్మణ్‌లు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా కుటుంబంలో ఏర్పడిన విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను చెక్‌పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకొని, ఆయుధాలు, వాహనం, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి పోలీసులు తెలిపారు.