భద్రాచలం మండల పలు సమస్యలకు ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తాం
*భద్రాచలం ఎమ్మార్వో, ధనియాల వెంకటేశ్వర్లు,
*తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఏప్రిల్ 06*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు భద్రాచలం తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినదని భద్రాచలం మండల తాహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు అన్నారు.
సోమవారం నాడు తన చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భద్రాచలం రెవెన్యూ పరిధిలోని ప్రజలు వివిధ సమస్యల కొరకు దరఖాస్తులు చేసుకున్నారని, ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ, ఎలక్ట్రికల్, రెవిన్యూ శాఖ మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్జీలు (04) దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, వాటిని పరిశీలించి వీలైనంత తొందరగా సమస్యలు పరిస్కారం కొరకు ఆయా శాఖలకు పంపించడం జరిగిందని, రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం జరిగిందని, ప్రజలు పెట్టుకున్న అర్జీలు పరిస్కారం దిశగా విచారణ జరిపి దరఖాస్తుదారినికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్జీని ఎంపీడీవో భద్రాచలం నకు చర్యలు చేపట్టడానికి పంపించడం జరిగిందని ఆయన అన్నారు.
ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ శాఖలలో ఏవైనా సమస్యలు ఉంటే మధ్య దళారులను ఎవరిని నమ్మకుండా నేరుగా ప్రజావాణి ద్వారా పరిష్కరించుకోవాలని, మండల స్తాయి అధికారులు ప్రజావాణి యందు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్, విద్యుత్ శాఖ మరియు ఐకెపి, వైద్య శాఖ, ఎంపీడీవో కార్యాలయంనకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-