logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వైభవంగా "విరినవ్వు" బాలగేయ సంపుటి ఆవిష్కరణ



సాలూరు సాహితీ మిత్ర బృందం 94వ సాహిత్య కార్యక్రమం
సాలూరు (సాంస్కృతికం):
స్థానిక శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల వేదికగా సాలూరు సాహితీ మిత్ర బృందం 94వ సాహిత్య కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మిత్ర బృందం వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ కవి రచయిత కిలపర్తి దాలినాయుడు రచించిన "విరినవ్వు" బాలగేయ సంపుటిని అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు.
కార్యక్రమ విశేషాలు:
కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత సాహితీవేత్త శ్రీ జె.బి. తిరుమలాచార్యులు కి సభ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం చావలి శేషాద్రి సోమయాజులు అధ్యక్షతన సభ కొనసాగింది.
ప్రముఖుల విశ్లేషణ:
నారంశెట్టి ఉమామహేశ్వరరావు (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత): "తెలుగు భాషలో మనసుకు హత్తుకునే అందమైన గేయాలను సృష్టించడంలో దాలినాయుడు మాస్టర్ ది ప్రత్యేక శైలి" అని కొనియాడారు.
మీసాల చినగౌరి నాయుడు (పుస్తక సమీక్షకులు): ఈ సంపుటిలో పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి, సామాజిక స్పృహ వంటి అంశాలు అద్భుతంగా ఉన్నాయని, విద్యార్థుల్లో మాతృభాషపై మక్కువను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని విశ్లేషించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో సాలూరు కు చెందిన పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు:
ముఖ్య అతిథులు: డాక్టర్ వి. గణేశ్వరరావు, డాక్టర్ ఏ. మోహనరావు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ.
గౌరవ అతిథులు: పాచిపెంట ఎం.ఈ.ఓ శ్రీ సతీష్ కుమార్, డాక్టర్ రావాడ భాస్కరరావు, ఆధ్యాత్మిక వేత్త కృష్ణాజి.
నిర్వహణ సత్కారం:
ఈ కార్యక్రమానికి ఆకుల గణపతి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, గొట్టాపు శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. సాహితీ మిత్ర బృంద సభ్యులు జేబీ కళ్యాణి, చందు మాస్టర్, రావాడ కృష్ణకుమారి, జక్కా నాగమణి, హరి ప్రసాద్, శ్రీ మీసాల గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సభానంతరం రచయిత కిలపర్తి దాలి నాయుడు ని మిత్రబృంద సభ్యులు , పట్టణ ప్రముఖులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

94
7405 views

Comment