logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

📰 రాజధాని అమరావతి చట్టబద్ధతపై రోలుగుంట జెడ్పీహెచ్‌ఎస్‌లో హర్షాతిరేకాలు

రోలుగుంట, ఏప్రిల్ 2: రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు టి.వి. శేషగిరిరావు, ఉపాధ్యాయురాలు నాగజ్యోతి తదితరులు నిన్న పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి “అమరావతి అజరామరం” అంటూ నినాదాలు చేస్తూ రాజధాని అభివృద్ధికి మద్దతు తెలిపారు. అలాగే “అమరావతి జిందాబాద్” నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది.
కార్యక్రమంలో పాల్గొన్న వారు అమరావతి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు దేశభక్తి, సామాజిక బాధ్యతలను ప్రతిబింబిస్తూ తమ మద్దతు తెలియజేయడం అభినందనీయమని ఉపాధ్యాయులు తెలిపారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

23
809 views

Comment