logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం

రాష్ట్రచేసుకునేలా ప్రజల వద్దకే పాలన మాదిరిగా వార్డు, గ్రామ సభలను నిర్వహిస్తుంది. ఇటీవల ప్రారంభమైన 99 రోజుల ప్రజాపాలన ప్రత్యేక ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో వార్డు సభలను నిర్వహించారు. ఈ క్రమంలోనే వార్డు నంబర్ 45లో చేపట్టిన వార్డు సభకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్రాజేశ్వర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని
ఆలపించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అనూష సతీష్ వార్డులో చేపట్టి పనులతో పాటు
పథకాల గురించి వివరించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలతో పాటు పథకాల
కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ శేషరావు, మెప్మా పీడీ
సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా డీఎంసీ శ్రీనివాస్, టీఎంసీ భాగ్యలక్ష్మీ, వార్డు
ఆఫీసర్ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ... ప్రభుత్వం
అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ వాటి ఫలాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 49 వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కరామే లక్ష్యంగా ప్రతి వార్డులో వార్డు సభలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు తోడుగా త్వరలో జూనియర్ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజనంతో పాటు అప్పహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 430 కళాశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. అదే విధంగా పేద కుటుంబానికి చెందిన యజమాని ఆకాల మరణం పొందితే ఈ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఐదు లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేస్తామన్నారు.

0
0 views

Comment