logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కుబీర్ గ్రామంలోని చిన్న హనుమాన్ ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు: ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 స్టీల్ ప్లేట్స్ అందించిన దంపతులు:



ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 స్టీల్ ప్లేట్స్ అందించిన దంపతులు:

కుబీర్ గ్రామంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం నందు అంగరంగ వైభవంగా వేడుకలను పురోహితుడు సాయి ప్రసాద్ జ్యోషి మహారాజ్ గణపతి పూజ, ఆంజనేయ స్వామి రుద్రాభిషేకం, మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం""నిర్మల్ వాస్తవ్యులైన శ్రీమతి శ్రీ మంగమణి~రాజేందర్ దంపతులు పేపర్ ప్లేట్స్లో తినడం వలన ఆరోగ్యానికి హానికరం అని, వీటి వల్ల క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 స్టీల్ ప్లేట్స్ లను గురు స్వామి పుప్పాల పీరాజి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి,ASI కే. లక్ష్మణ్,PACS సెక్రటరీ క్రాంతి కుమార్, గంగాధర్ పటేల్, రేడశెట్టి, నికిల్ సేటు, నితిన్ సేటు, అక్షయ్ సేట్, పోగుల లింగన్న శ్రీమతి శ్రీ పుప్పాల పద్మ పలువురు మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు . తదనంతరం భక్తులు అన్నదానంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

0
0 views

Comment