అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా మంగళవారం బస్టాండ్ సమీపంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, పాపన్న గౌడ్ విగ్రహం, చిత్
పత్రికా ప్రకటన
ఏప్రిల్ 02, 2026, ఆదిలాబాద్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా మంగళవారం బస్టాండ్ సమీపంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, పాపన్న గౌడ్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ పాపన్న గౌడ్ 18వ శతాబ్దంలోనే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా సామాజిక విప్లవకారుడని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా గుర్తు చేశారు.
పాపన్న గౌడ్ కేవలం ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ యువతకు ఆయన చరిత్రను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, బీసీ అభివృద్ధి అధికారి దరావత్ సోనియా, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.