logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి , డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం

కామారెడ్డి ప్రతినిధి
తేదీ :01.04.2026

కామారెడ్డి జిల్లా బుధవారం.

రానున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి , మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
బుధవారం మినీ సమావేశ మందిరంలో అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు తో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాలు ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వేదిక వద్ద కూర్చునే సౌకర్యాలు, త్రాగునీరు, భోజన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం లో aclb మధుమోహన్, rdo NV గిరి, సంఘ సభ్యులు, sc కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

19
1229 views

Comment