భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ కి ఘన సన్మానం
భద్రాచలం (31.03.2026)
తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికై, తొలిసారిగా భద్రాచలం విచ్చేసిన చలకాని వెంకట్ యాదవ్ ని భద్రాచలం బార్ అసోసియేషన్ మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం మాట్లాడుతూ., రాష్ట్ర స్థాయి బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన వెంకట్ యాదవ్ భద్రాచలం బార్‌కు రావడం సంతోషదాయకమని, ఆయన నాయకత్వంలో న్యాయవాదుల సంక్షేమం మరింత మెరుగుపడుతుందని ఆకాంక్షించారు. అనంతరం అతిథిని శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ప్రస్తుత కార్యవర్గ పదవీ కాలం ముగుస్తున్న చివరి రోజు సందర్భంగా, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించిన కోట దేవదానం ని స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవదానం మాట్లాడుతూ., తన పదవీ కాలంలో సహకరించిన కార్యవర్గ సభ్యులకు మరియు తోటి న్యాయవాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసచారి, లేడీ రిప్రజెంటిటివ్ ఎం తరుణి, సీనియర్ న్యాయవాదులు గోడపర్తి నాగరాజు, రావి రామ్మోహన్, పి. సోమరాజు, పేరాల వెంకటేశ్వర్లు, ఏ.సత్యనారాయణ, డి. సంధ్య, ఎస్ మల్లేష్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.