ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి గారిని
పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి గారి తల్లి చంద్రకళమ్మ గారు స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి గారు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, చంద్రకళమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.