జిల్లా లో 20% ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యం
40 సైన్ బోర్డులు ఏర్పాటు.
అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటుచేసిన సూచిక బోర్డులు
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 31 :-
అదిలాబాద్ నుండి మహారాష్ట్ర కన్వర్ట్ కి వెళ్లే రహదారి మొత్తంలో సూచిక బోర్డులు ఏర్పాటు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
జిల్లాలో గణనీయంగా ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నూతన విధానాలతో ప్రజలలోకి వెళ్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ పట్టణం నుండి మహారాష్ట్ర కన్వర్ట్ కి వెళ్లే రహదారిపై రాంపూర్ రోడ్డు ప్రారంభం నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు 40 సూచిక బోర్డులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు లను ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారులలో ఒకటైన ఈ జాతీయ రహదారి పై సూచిక బోర్డులను ఏర్పాటు చేసి గణనీయంగా ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే కల్వట్ల వద్ద, క్రాసింగ్ వద్ద, బ్రిడ్జిల వద్ద, గ్రామాల వద్ద మరియు ప్రమాదకర మూల మలుపుల వద్ద వాహనదారులకు అర్థమయ్యేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల లో మరణాలను 20% తగ్గించడమే లక్ష్యం అని ప్రతి గ్రామం నందు ప్రతి వాహనదారునికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేయవద్దని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించడం ద్వారా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయాలలో అన్ని రహదారులపై పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణి ధర్, ఎస్సై తాంసి ఎస్ జీవన్ రెడ్డి, పున్నారి గ్రామ సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచి రామిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.