హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలనా?
హైదరాబాద్ : దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలనే రిజర్వేషన్లు రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు, పూజారులు మాత్రం ఒకే వర్గం వాళ్ళు ఎలా ఉంటారని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలని రాముడు చెప్పాడా..? కృష్ణుడు చెప్పాడా..? వెంకటేశ్వరుడు చెప్పాడా..? అని పేర్కొన్నారు. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరారు.