మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యం
రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి - క్షేమంగా ఇంటికి తిరిగి రండి
330 మంది ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచిత
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 30 :-
మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యం
రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి - క్షేమంగా ఇంటికి తిరిగి రండి
330 మంది ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు.
నిష్ణాతులైన వైద్యులచే కంటి పరీక్షల నిర్వహణ.
50 డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాల అందజేత.
"అరైవ్ అలైవ్" లో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ తో ప్రమాదాలను అరికట్టవచ్చు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి శివధర్ రెడ్డి గారిచే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమం సందర్భంగా ఈరోజు మధ్యానం బోథ్ మండల కేంద్రంలో పరిచయ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యం అని తెలిపారు. ప్రతి ఒక్క ఆటో యజమాని "అభయ మై టాక్సీ ఇస్ సేఫ్" అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, దీని ద్వారా లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు. ఆటోలలో ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు చేయవద్దని, డ్రైవర్లకు ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్ష లో బోథ్ చెందిన 330 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లు పాల్గొన్నట్లు తెలిపారు. వీరందరికీ నిష్ణాతుడైన కంటి వైద్యులు డాక్టర్ బి రామకృష్ణ ఎంఎస్ ఆప్తమాలజీ, వైద్య పరీక్షలను నిర్వహించినట్లు, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరీక్షలను పరిశీలించి, నిరుపేద 50 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలను ఇచ్చారు. నలుగురికి శస్త్ర చికిత్సలు అవసరం ఉండగా వారిని ఆదిలాబాద్ పట్టణంలో ఉచితంగా వైద్య సేవలు అందించనునట్లు తెలిపారు. ముఖ్యంగా ఆటోలలో టాక్సీలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, గంజాయి మాదకద్ర వ్యాలు లాంటి వాటివి తరలకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను, వాటిని రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని డ్రంక్ డ్రైవ్ చేసిన వాహనాలను సీజ్ చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, స్థానిక నాయకులు ఆడే గజేందర్, బోథ్ సీఐ డి గురుస్వామి, ఎస్ఐ లు వి పురుషోత్తం,జి సంజయ్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, ఆత్మ చైర్మన్ గొల్ల రాజు, స్థానిక సర్పంచ్ అన్నపూర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.