దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు-సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దం:మందకృష్ణ మాదిగ..
దళితులు క్రిస్టియన్స్ గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుంతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ పార్లమెంటు, న్యాయవ్యవస్థకు, రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్థ రద్దు చేయాలన్నారు. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.