నంద్యాల జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి నీ మర్యాదపూర్వక కలిసిన ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం .
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణలో గౌరవ 3వ అదనపు జిల్లా జడ్జి (ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు ఇన్‌ఛార్జ్) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన బాడీ సభ్యులు తమ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా న్యాయమూర్తికి పూలమాల తో అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి. శివరామిరెడ్డి, ఉపాధ్యక్షులు దాట్ల ప్రభాకర రెడ్డి (మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్), ప్రధాన కార్యదర్శి ఎ. గోపాల్ రెడ్డి, మహిళా సంయుక్త కార్యదర్శి షహీనా బేగం, కోశాధికారి లక్ష్మి శ్రావణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బార్ ప్రతినిధులు ఆళ్లగడ్డకు కొత్తగా మంజూరైన అదనపు JFCM కోర్టు కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని గౌరవ న్యాయమూర్తిని కోరారు. దీనివల్ల కేసుల సత్వర పరిష్కారానికి వీలు కలుగుతుందని, తద్వారా న్యాయవాదులకు మరియు కక్షిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
న్యాయమూర్తి గారు ఈ విన్నపంపై సానుకూలంగా స్పందిస్తూ, కొత్త కోర్టు ప్రారంభోత్సవానికి తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.