జర్నలిస్టులకు కనీస వేతనం, ఇండ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు ఇవ్వాలి
*కొత్తగూడెం శాసన సభ్యులు, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** కొత్తగూడెం **మార్చి 28**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
****"***************************
జర్నలిస్టులకు కనీస వేతనం, ఇండ్ల స్థలాలివ్వాలి: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు. జీరో అవర్‌లో జర్జలిస్టుల సమస్యలపై ఆయన మాట్లాడారు.సబ్సిడీతో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు అందించాలని కోరారు. హెల్త్ కార్డులు, జీవిత బీమా, రిటైర్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న పత్రికలకు యాడ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.