logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరులో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

నెల్లూరులో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్‌లో, విజయ మహల్ గేటు వద్ద నాగేంద్ర మరియు టీం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి పొంగూరు రమాదేవి గారితో పాటు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు, కూటమి నాయకులు భక్తిశ్రద్ధలతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా గునుకుల కిషోర్ గారు మాట్లాడుతూ, “రామో విగ్రహవాన్ ధర్మః” అనే వాక్యాన్ని స్మరించుకుంటూ, శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన జీవితం నిజాయితీ, కర్తవ్యబోధ, త్యాగం, న్యాయం వంటి విలువలను మనకు నేర్పుతుందని అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం మన కుటుంబ వ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

సీతమ్మ గారి సహనం, శ్రీరాముడి నిబద్ధత ప్రతి కుటుంబం అనుసరించాల్సిన ఆదర్శాలని ఆయన పేర్కొన్నారు. ఈ మహోత్సవాన్ని భక్తితో, శ్రద్ధతో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ, సనాతన ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా నిలుస్తాయని అన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, మంచి విలువలు పెంపొందించే ప్రతి కార్యక్రమానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

శ్రీ సీతారాముల ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి రమాదేవి గారు, కిషోర్ గునుకుల గారి సతీమణి విజయలక్ష్మి గునుకుల, 45వ డివిజన్ జనసేన నాయకులు సుదా మాధవ్ బెల్లపు, బీజేపీ నాయకులు ఇండ్ల శ్రీనివాసులు, రాజేశ్వరమ్మ, తెలుగుదేశం నాయకులు యశ్వంత్, పోకాల రవి, శ్రీనివాసులు, గాయత్రి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

1
0 views

Comment