logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉన్మాదుల యుద్ధానికి ఎదురుదెబ్బ __ డి.వి.వి.యస్.వర్మ, సంపాదకులు, 85006 78977

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** మార్చి 27 **(ఏఐఎంయూ మీడియా ప్రతినిధి)



** ఉన్మాదుల యుద్ధానికి ఎదురుదెబ్బ

__ డి.వి.వి.యస్.వర్మ,
సంపాదకులు, 85006 78977

అమెరికా, ఇజ్రాయెల్లు ఇప్పుడు ఇరాన్ మీద సాగిస్తున్నది స్వీయ రక్షణ కోసం సాగిస్తున్న యుద్ధం కాదు. ఇది ఇద్దరు ఉన్మాదులు సాగిస్తున్న యుద్ధం. ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్నాడు. ప్రపంచంలో ఎక్కడ సంఘర్షణ జరుగుతున్నా తానే మధ్యవర్తిగా దిగి శాంతిని నెలకొల్పుతున్నానని ప్రకటించాడు. భారత్-పాక్ యుద్ధ విరమణ తానే చేయించానని మోదీకన్నా ముందు ఆయనే ప్రకటించాడు. అంతమాత్రాన ట్రంప్ శాంతి దూత కాదు. నిఖార్సయిన యుద్ధోన్మాది. “అమెరికా ఫస్ట్ ” అంటాడు. ప్రపంచం అంతా తన చెప్పు చేతల్లో వుండాలంటాడు. ఉండకపోతే ఊరుకోనంటాడు. వెనిజువెలాలో ఎన్నికైన దేశాధ్యక్షుడిని బందీగా దాడి చేసి తెచ్చాడు. దాని ఆయిల్ నిక్షేపాల మీద ఆధిపత్యం సంపాదించాడు. గ్రీన్లాండ్ తనకు కావాలంటాడు. క్యూబాను కబళిస్తానంటాడు. మెక్సికో అమెరికాలో అంతర్భాంగం అంటాడు. ఇదీ ట్రంప్ యుద్ధోన్మాదం. ప్రపచం దేశాల సార్వభౌమాధికారం మీద దాడి చేసే ఉన్మాదం. ఆ దేశాల సహజ వనరులను కాజేసే పన్నాగం. అంగబలం, ఆర్థిక బలం వుందన్న గర్వంతో చేస్తున్న ప్రేలాపనల ఉన్మాదం. ఇందులో భాగంగానే అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టాయి.

యుద్ధం మొదటి రోజునే దేశాధ్యక్షుడైన ఖమైనీని హతమార్చారు. ఇరాన్ పని అయిపోయిందని అక్కడ త్వరలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ట్రంప్ ప్రగల్భాలు పలికాడు. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు ప్రమాదం లేదు. కాని, అమెరికాకు గల్ఫ్ దేశాలు కావాలి. అక్కడి ఆయిల్ నిక్షేపాలు కావాలి. లొంగి వుండే జీ హుజూర్ ప్రభుత్వాలు కావాలి. దీని కోసం గల్ఫ్ దేశాలైన ఖతార్, బహ్రెన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ఇరాక్లలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం మీద అనేక జెట్ విమానాలు, భారీ యుద్ధ నౌకలు, 40 వేల వరకు సైనికుల నిరంతర నిఘాలో ఆ దేశాలు వున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఈ అమెరికా స్థావరాలను భస్మీపటలం చేస్తున్నది. ఈ దేశాల ఆయిల్ నిక్షేపాలను అగ్నికి ఆహుతి చేస్తున్నది. అమెరికా రక్షణ పాటవం తమ స్థావరాలనే కాపాడుకోలేని స్థితిలో పడింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ బుగ్గిపాలైంది. తన అధీనంలోని అంతర్జాతీయ రవాణా మార్గమైన హార్మోజ్ను మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభానికి తెరతీసింది. ఇరాన్ ప్రతిఘటనతో ప్రపంచం ఆయిల్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు ట్రంప్ శాంతి ప్రవచనాలు పలుకుతున్నాడు. యుద్ధ విరమణకు చర్చలంటున్నాడు.

ఈ యుద్ధంలో మోదీ విదేశాంగ రాజనీతి పరాభవంపాలైంది. చిరకాలంగా వున్న ఇరాన్ మిత్రత్వాన్ని పక్కనబెట్టి ఇజ్రాయెల్ను పితృదేశంగా మోదీ ప్రకటించి అపహాస్యం పాలయ్యారు. అమెరికా చెప్పు చేతలలో ఆయన రాజనీతి తలదాచుకుంటున్నది. రష్యా నుంచి 30 రోజులపాటు ఆయిల్ కొనుగోలుకు అనుమతి ఇస్తూ ట్రంప్ చేసిన ప్రకటన భారత సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టు. ఇరాన్ అధ్యక్షుణ్ణి దాడిచేసి చంపినా ఖండించలేని దుస్థితిలో మోదీ పడ్డారు. ఎప్ స్టీన్ ఫైల్స్లో పేరు వుండడం, అదానీ కేసులు వల్ల ఈ లొంగుబాటు అని సామాజిక మాధ్యమాలు చేస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది భారత విదేశాంగ విధానంలో చెరగనిమచ్చ. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయిల్ ఉన్మాదుల యుద్ధానికి ఇరాన్ గొప్ప గుణపాఠం నేర్పింది.


1
192 views

Comment