logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హాస్టల్ సదుపాయాలపై మండల స్పెషల్ ఆఫీసర్ వి. రాజేశ్వర్ ఆకస్మిక తనిఖీ

కొత్తగూడ, మార్చి 26:

జిల్లా విద్యాశాఖ అధికారి మరియు కొత్తగూడ మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి. రాజేశ్వర్ ఈ రోజు కొత్తగూడ మండలం పరిధిలోని AHS సాదిరెడ్డి పల్లె హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్హించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా టాయిలెట్ల పనితీరు, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేసి, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

హాస్టల్ సిబ్బంది హాజరు విధానం, వారి పనితీరును సమీక్షించి, విధుల్లో నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్ నిర్వహణను పరిశీలించి, రికార్డులు క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుభ్రమైన వాతావరణం, సురక్షిత నివాసం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన నూతన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హాస్టల్ సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమాలను కచ్చితంగా పాటిస్తూ హాస్టల్ నిర్వహణలో నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

16
748 views

Comment