బీసీల హక్కుల కోసం BRS ఎమ్మెల్యేల నిరసన
తేదీ:-26.03.2026
హైదరాబాద్
గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు జరిగిన నిరసన ర్యాలీలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మరియు ఇతర ఎమ్మెల్యేలు పాల్గొని, బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల కోసం ప్రత్యేకంగా 22 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని, బీసీ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని మరియు బీసీ విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.