logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నాకాబంది లో ఆదిలాబాద్ జిల్లా. నేరాల నియంత్రణకు నాకాబంది నిర్వహణ. జిల్లావ్యాప్తంగా 28 చెక్పోస్టుల ఏర్పాటు.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 26 :-



రాత్రి 9:00 గంటల నుండి రాత్రి 12:00 వరకు జిల్లాలో పూర్తిగా సరిహద్దుల్లో, పట్టణాల్లో ఏకకాలంలో నాకాబంది నిర్వహించిన జిల్లా పోలీసులు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అక్రమ రవాణల కు చెక్.

41 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు,13 నంబర్ ప్లేట్ లేని వాహనాలు స్వాధీనం.

జిల్లావ్యాప్తంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు స్వాధీనం.

జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో నాకాబంది నిర్వహించిన అన్ని పోలీసు స్టేషన్ అధికారులు సిబ్బంది.

జిల్లాతో మహారాష్ట్ర సరిహద్దుల్లో, అంతర జిల్లా సరిహద్దుల్లో, పట్టణాల్లో వాహన తనిఖీలు.

మొత్తం 20 పోలీస్ స్టేషన్లో పరిధిలో నిర్వహించిన నాకాబంది

స్వయంగా నాకాబంది చెక్ పోస్ట్ లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.

గత రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నాకాబంది నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 20 పోలీస్ స్టేషన్లో పరిధిలో 28 చెక్పోస్ట్ అనే ఏర్పాటు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. నిబంధనలు అతిక్రమించి నంబర్ ప్లేట్ లేకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, లైసెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి కట్టడి చేయడం జరిగిందని తెలిపారు. గత రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని మైనర్లు వాహనాలు నడుపుతున్న క్రమంలో పరిశీలించడం జరిగింది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఆటో డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులను పరిశీలించడం జరిగింది. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై జరిమానాలు విధించడం జరిగింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 41 డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, నంబర్ ప్లేట్ లేని 13 ద్విచక్ర వాహనాలు, సరైన ధ్రువపత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు ఒక కారు ఒక కంటైనర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు, అదేవిధంగా జైనథ్ పిప్పర్ వాడ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా అనుమతులు లేకుండా రెండు బొలెరో వాహనంలో తరలిస్తున్న ఆరు ఎడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావల ఎస్హెచ్ఓ రాహుల్ కాంత్ ఐపిఎస్, సిఐలు ఎస్సైలు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పాల్గొన్నారు.

0
0 views

Comment