కలుషిత ఆహారం ఘటన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి.
నంద్యాల (AIMA MEDIA ): పట్టణ శివారులోని వైఎస్సార్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఇటీవల ఓ విందు భోజనం ఆరగించిన సుమారు 80 మంది బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, స్థానిక నాయకులు రమణ మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు: వైసీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి టెండర్లు వేస్తే, ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు ఆపేశారని ఆరోపించారు. వైఎస్సార్ కాలనీ ఏర్పాటుకు దివంగత వైఎస్సార్, శిల్పా మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, కానీ నేడు అధికారులు కనీస మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా బాధితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమని, వారికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన శిల్పా రవి, ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ 38వ వార్డు ఇన్చార్జి టీవీ రమణ, మాజీ కౌన్సిలర్ మేస చంద్రశేఖర్, వైసీపీ నాయకులు జయప్రకాశ్ రెడ్డి, సోమశేఖర్,అంకాలయ్య,రామకృష్ణారెడ్డి, అన్వర్ భాష,సాయి,కిరణ్, నాయక్,బాబు,చిరు,ప్రసాద్ రెడ్డి,గీతా రాణి,సాయి,వెంకీ,వెంకటస్వామి శెట్టి,సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.