రేబాల వైసీపీ గ్రామ కమిటీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యక్రమం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేబాల గ్రామ కమిటీ అధ్యక్షుడు పోశంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు కమిటీ సభ్యులు నేడు నెల్లూరులోని నివాసంలో మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిర్మించేందుకు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ నాయకులు చెర్లో సతీష్ రెడ్డి, పోశంరెడ్డి దయాకర్ రెడ్డి, వల్లూరు అశోక్ రెడ్డి, కోడూరు నిరంజన్ రెడ్డి, పోతిరెడ్డి నాగ సుబ్బారెడ్డి, ముమ్మిడి కృష్ణారెడ్డి, కడవ రవికుమార్, అయ్యం సుబ్బారెడ్డి, గుడి అశోక్, పిల్లమెట్ల శ్రీహరి, గంపల అంకయ్య, కార్తీక్ పాల్గొన్నారు.
అలాగే వైసీపీ నాయకులు గొల్లపల్లి విజయకుమార్, కలువ బాల శంకర్ రెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీమతి కవనగిరి శ్రీలత, దేవిరెడ్డి సాయి రెడ్డి, కమరగిరి ప్రసాద్, శ్రీమతి వడ్డే సంపూర్ణమ్మ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.