logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సర్వేంద్రియానాం నయనం ప్రధానం రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి - క్షేమంగా ఇంటికి తిరిగి రండి 100 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 25 :-


"అరైవ్ అలైవ్ 2.0" లో భాగంగా కార్యక్రమం.

ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించాలి.

ఆటోలలో డ్రైవర్ సీట్ పక్కన ఎవరు ఉండకూడదు.

ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి శివధర్ రెడ్డి గారిచే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్ 2.0" కార్యక్రమం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టియు భవన్ నందు పట్టణంలోని ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డిఎస్పి మాట్లాడుతూ డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క ఆటో యజమాని "అభయ మై టాక్సీ ఇస్ సేఫ్" అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, దీని ద్వారా లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు. డ్రైవర్లకు ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 చేసి ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఈ ఉచిత కంటి పరీక్షలలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 100 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నట్లు తెలిపారు. వీరందరికీ ఆదిలాబాద్ లోని వైద్యులచే వైద్య పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించాలని తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ సీటు పై డ్రైవర్ మాత్రమే ఉండేలా చూసుకోవాలని, డ్రైవర్ సీట్ పక్కన ఎవర్ని ఉంచరాదని తెలిపారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని తెలియజేశారు. అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలను నడపవద్దని తెలిపారు. ఆటోలు, వాహనాల ద్వారా నేరాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు,కర్రె స్వామి, ప్రణయ్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
12 views

Comment