ప్రతి గ్రామంలో సిసి టీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి పాటుపడాలి.
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 25 :-
మండలంలో నేరాల నియంత్రణకు పటిష్టమైన గస్తీ నిర్వహించాలి
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి.
నమోదైన కేసుల పై పూర్తి స్థాయిలో సమీక్ష.
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిశీలన.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఇచ్చోడ మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామం నందు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తూ సీసీటీవీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఈరోజు ఆకస్మికంగా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి పలు సూచనలు చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రతి గ్రామం నందు గంజాయి వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ యువతను చైతన్యపరచాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. నేరాలు జరగకుండా మరియు జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. మండలంలో ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని తెలిపారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసును నందు శిక్షలు పడే విధంగా దర్యాప్తు కొనసాగించాలని తెలిపారు. తప్పు చేసిన ప్రతి ఒక్క నేరస్తునికి శిక్ష కచ్చితంగా పడేవిధంగా పరిశోధన జరగాలని సూచించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై, ప్రజలకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు వారం రోజులపాటుగా "అరైవ్ అలైవ్ 2.0" లో భాగంగా పలు ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులకు తమ పూర్తి సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్సై నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.