logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లొంగిపోయిసంవత్సరాలు గడుస్తున్నాఅందరి పునరావాసం


రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరే గ్రామానికి చెందిన ఉత్తం శ్రీనివాస్ పునరావాసం కల్పించండి అంటూ పీపుల్స్ వార్ మాజీ దళ సభ్యుడు అధికారులను వేడుకున్నారు అడవిపదిర గ్రామానికి చెందిన ఉత్తం శ్రీనివాస్ మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి తన సమస్యను వివరించారు
ఆయన తెలిపిన వివరాల ప్రకారం 1989 జూలై 10న పీపుల్స్ వార్ పార్టీలో చేరి దళ సభ్యుడిగా అజ్ఞాత జీవితంలోకి వెళ్లి దాదాపు నాలుగు సంవత్సరాలు నక్సలైట్‌గా గడిపారు అనంతరం ప్రభుత్వ పిలుపు మేరకు 1993 మే 1న అప్పటి కరీంనగర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నా, తమకు ఎలాంటి స్థిర ఆస్తులు లేకపోవడంతో తీవ్ర పేదరికంలో జీవిస్తున్నట్లు తెలిపారు కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారిందన్నారు అప్పటి జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జిల్లా ఎస్పీ సిఫారసు చేసినప్పటికీ ఇప్పటివరకు పునరావాసం కింద ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పునరావాసం కింద ఒక ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయించాలని ఆయన కోరారు గత ప్రభుత్వం హయంలో కల ఉమ్మడి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అదేశలు ఉన్న పట్టించుకోని అధికారులు ఇప్పటికైనా మాజీలకు వ్యవసాయం చేసుకోవడానికి భూమి మరియు ఇల్లు ఇప్పించాలని కోరారు

123
3690 views

Comment