విజయవాడలో APEMCL కార్యాలయంలో కీలక సమావేశం
ఈరోజు విజయవాడలోని APEMCL కార్యాలయంలో క్రాంతి లాల్ దండే గారితో పాటు శర్వానంద్ గారితో సమావేశం నిర్వహించినట్లు APEMCL చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పరిశ్రమల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించే మార్గాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు.
అలాగే రేపు జరగనున్న బోర్డు సమావేశానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు.