తెలుగు ప్రజలకు శుభవార్త.. ఆర్డీటీ సేవలు ఇక నిరంతరాయం: లోకేష్*
*తెలుగు ప్రజలకు శుభవార్త.. ఆర్డీటీ సేవలు ఇక నిరంతరాయం: లోకేష్*
Mar 24th, 2026
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. లక్షలాది మంది సంతోషించే సమాచారం. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.