logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీపీడీ కళాశాల ఆధ్వర్యంలో 7 రోజుల ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ ప్రారంభం

బీపీడీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మార్చి 23 నుండి 31 వరకు వారంరోజుల పాటు నిర్వహించనున్న ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి ఉదయం 8.40 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ యొక్క లక్ష్యం “Not Me But You” అని, మన కోసం కాకుండా సమాజం కోసం సేవ చేయడమే ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సేవా దృక్పథంతో యువత ముందుకు సాగి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ మాట్లాడుతూ యువత తప్పు మార్గాల్లో నడవకుండా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని సూచించారు.

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ తెలిపారు ఈ క్యాంప్‌లో 25 మహిళా వాలంటీర్లు, 25 పురుష వాలంటీర్లు పాల్గొంటున్నారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1
878 views

Comment