logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా వెటర్నరీ, పశుసంవర్ధక అధికారి (DVAHO), మునిసిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి ప్రతినిధి తేది:23.03.2026. కామారెడ్డి జిల్లా
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా వెటర్నరీ, పశుసంవర్ధక అధికారి (DVAHO) మునిసిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాన్ని అత్యవసరంగా, కేవలం రెండు రోజుల్లోనే ప్రారంభించాలని సూచించారు.
ప్రస్తుతం అందుబాటులో లేని అవసరమైన ఔషధాలను వెంటనే కొనుగోలు చేసి, వాటి లభ్యతను నిరంతరం నిర్ధారించాలని ఆదేశించారు.
అదేవిధంగా, ABC కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభించి, ముందుగా దోమకొండలో అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.
సంబంధిత జిల్లా అధికారులు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

17
857 views

Comment