logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అదిలాబాద్ మున్సిపాలిటీకి గత నెలలో పర్యటన నిమిత్తం వచ్చిన ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ,ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారు

అదిలాబాద్ మున్సిపాలిటీకి గత నెలలో పర్యటన నిమిత్తం వచ్చిన ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ,ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారు , వేం నరేందర్ రెడ్డి గారికి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు , మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష గారి అభ్యర్థన రిక్వెస్ట్ మేరకు చనాక కోరాటా నుండి తాగునీటి కొరకు 54 కోట్లు , మౌలిక సదుపాయాలు డ్రైనేజీలు , కలవాట్లు, సిసి రోడ్ల, బీటీ రోడ్ల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు జిల్లా కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది.ఇట్టి అంశంపై మున్సిపల్ చైర్ పర్సన్ గారు తన చాంబర్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ గారు ఈఈ గారు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి వెంటనే 54 కోట్ల రూపాయలతో తాగినీటి కొరకు , 100 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు , బిటి రోడ్లు నాణీలు ,కలవట్ల కోసం రేపటినుండి అధికారులు వార్డ్ వైస్ తిరుగుతూ 49 వార్డుల నుండి ప్రపోజల్స్ వెంటనే తయారు చేయాలని ఆదేశించడం జరిగింది. వారం రోజుల్లో అన్ని ప్రపోజల్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చైర్పర్సన్ బండారి అనూష ఆదేశించడం జరిగింది. అదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని గౌరవ 49 మంది కౌన్సిలర్లకు సమానంగా చూస్తూ అన్ని వార్డులలో అత్యంత వెనుకబడ్డ వార్డులకు మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది.మట్టి రోడ్లకు , వెనుకబడ్డ విలీన గ్రామపంచాయతీ వార్డులకు మొదటి ప్రయారిటీ పార్టీలకతీతంగా ఇస్తామని తెలపడం జరిగింది.ఈ 100 కోట్లు నాలుగు విడతలుగా ఇస్తామని ఇంచార్జ్ మంత్రి గారు తెలపడం జరిగింది.

0
57 views

Comment