గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దు
జిల్లా వ్యాప్తంగా రేపటినుండి 8 బృందాలచే ఆకస్మిక తనిఖీలు
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 23 :-
హోటల్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపార సంస్థలు వాణిజ్య గ్యాస్ ను ఉపయోగించాలి
గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ.
నిబంధనలు ఉల్లంఘించిన వాణిజ్య సముదాయాలపై కేసులు నమోదు చేయబడతాయి
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు గమనించబడిన నేపథ్యంలో, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాణిజ్య సముదాయాల వద్ద రెండు రోజులుగా అవగాహన కల్పించబడింది అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఇకనుండి చట్ట విరుద్ధంగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్, వాణిజ్యానికి పరంగా ఉపయోగించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం సబ్సిడీతో ప్రజలకు అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా, ప్రజల ప్రాణ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలు వంటి ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. రేపటినుండి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలచే తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని, నిబంధనలో నించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
వ్యాపార సముదాయాలు ఇకపై ఎవరైనా గృహ వినియోగ గ్యాస్‌ను అక్రమంగా వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇటువంటి అక్రమ వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజ భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.