శ్రీ కోన ప్రభాకరరావు గారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాపతిగా, శాసనసభ్యులుగా,ఆర్థిక మరియు ప్రణాళికా శాఖమంత్రిగా, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ గా.. రాజకీయ రంగంలో కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
ప్రభాకరరావు గారు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసు లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత పూణే లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశారు.
పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహము లోనూ చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు.
ప్రభాకరరావు గారు1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనారు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనారు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ పతిగా నియమితులైనారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. భవనం వెంకట్రామ్ మరియు కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశారు.
ప్రభాకరరావు గారు1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితులైనారు.ఆ తరువాత
సిక్కిం గవర్నరుగా, మహారాష్ట్ర గవర్నరుగా నియమితులైనారు.
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకరరావు గారు 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యారు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమా లను నిర్మించి, దర్శకత్వం వహించారు. కొన్నింటిలో స్వయంగా నటించారు కూడా. ఈయన సినిమాలలో ముఖ్యమైనవి
మంగళసూత్రం (1946 ) నిర్దోషి -నిరపరాధి - రూపవతి (1951 ) ద్రోహి (1948 ) మరియు సౌదామిని (1951 ) వంటి పలు చిత్రాలలో నటించారు.
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశారు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డారు.
బాపట్లను నల్లమడ జిల్లాగా చేయాలి అనే ఆలోచనకర్త
బాపట్లఎడ్యుకేషన్ సొసైటీ సృష్టికర్త బాపట్లలొ ఉన్న ప్రతి పేదవాడికి 3సెంట్లు స్థలం ఇచ్చిన మహనేత
బాపట్ల ప్రాంతంలో ఉన్న బీడుపోయిన పొలాలకోసం కాల్వలు త్రొవ్వించి అపొలాలకు నీరుఅందిచి బీడుగామారిన పొలాలనుపచ్చని పైరుగా చేసి రైతుల కుటుంబాలలొ బాపట్లప్రజలలొ ఆనందాలు నింపిన రైతుభాంధవుడు .
బాపట్ల పట్టణంలో మంచినీటి ట్యాంకు మరియు మంచినీటిచెరువు కట్టించి నేటికి బాపట్లమునిసిపాలిటీకి సంవత్సరనికి 1 కోటి ఆదాయ వచ్చే విధంగా చేసిన ముందుచూపు కలిగిన మర్గదర్శి .
ఈయన అక్టోబరు 20, 1990 న హైదరాబాదులో మరణించారు.