జిన్నా పాఠం తొలగించండి.. జమ్మూలో ఆందోళన
జమ్ము వర్సిటీ ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చాఫ్టర్ని వెంటనే తొలిగించాలని లేనిచో ఆందోళన మరింతగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-2028 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసన సిలబస్లో 'ఆధునిక భారత రాజకీయ ఆలోచన' అనే శీర్షిక కింద, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. దేశ విభజనలో పాత్ర పోషించి, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వీరే. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తోంది'. అని ఏబీవీపీ నాయకులు తెలిపారు.
పాఠ్యప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా, మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.
అయితే దీనిపై పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి బల్జిత్ సింగ్ మాన్ స్పందించారు" జిన్నా మరియు ఇతర మేధావులను చేర్చడం పూర్తిగా విద్యాపరమైనదేనని, ఇది దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళికలకు, అలాగే యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని" తెలిపారు. విశ్వవిద్యాలయం ఏ భావజాలాన్నీ ప్రోత్సహించదని, కానీ విమర్శనాత్మకతకు వీలు కల్పించేందుకు భిన్నమైన దృక్కోణాలను విద్యార్థులకు అందిస్తుందన్నారు. మంచి చెడులను అంచనా వేసి, ఏది సరైనదో ఏది తప్పో విచక్షణ కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.