logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బడ్జెట్ ప్రతులు దహనం బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయము

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించిన బడ్జెట్ కేటాయించనందున బడ్జెట్ ప్రతులను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దహనం చేస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తీరా అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతున్న బీసీల జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించిన సందర్భంగా లేకపోవడం అంటే ఇది బీసీలపై వివక్షగా భావిస్తున్నాం బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీసీలకు 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ మా డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరం మొదటి బడ్జెట్ సమావేశాల్లో 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించవలసిన స్థానంలో తొమ్మిది వేల కోట్లు రెండవ బడ్జెట్ సమావేశాల్లో 11 వేల కోట్లు మరి మొన్నటి సమావేశంలో 12,511 కోట్లు మాత్రమే 56% బీసీ జనాభా ఉంటే బీసీలకు కేటాయించింది నామమాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు బిస్కెట్లకు కూడా సరిపోవు బీసీల ఆర్థిక అభివృద్ధి ఎలా సాధ్యమని అడుగుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై పునర్ సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందు కాంగ్రెస్ ని ఎండగట్టి దోషిగా నిలబెడతమని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ వేముల అశోక్ రామగిరి రాజన్న చారి మహిళా నాయకురాలు పేరం అలేఖ్య కొట్టే నటేశ్వర్ మంచెర్ల సదానందం చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

9
358 views

Comment