logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా“నీవు” పుస్తక ఆవిష్కరణ


విజయనగరం జిల్లా.చీపురుపల్లి:

రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రచయిత స్వీయ రచన “నీవు” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమాన్ని పాలవలస శ్రీనివాసరావు, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ దంపతులు సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమం సాహిత్య సౌరభంతో, వైభవంగా సాగింది.
ఈ వేడుకకు వైఎస్సార్సీపీకి చెందిన రాజాం టౌన్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై రచయితను అభినందించారు.
అలాగే సాహితీవేత్తలుగా జిఎన్‌ఆర్ కాలేజీ కరస్పాండెంట్ విజయ్ కుమార్, శ్రీ రామా వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ రెడ్డి రామారావు మాస్టర్, ఆగూరు సాయిరాం తదితరులు పాల్గొని రచయితకు అభినందనలు తెలిపారు.

30
1128 views

Comment