అధికారుల నాయకులనిర్లక్ష్యం… రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించిన ఆర్టీసీ డ్రైవర్
కోరుట్ల ప్రతినిది అల్లం రాజేష్
కోరుట్ల పట్టణంలోని రాయికల్ వెళ్ళే దారిలో మాదాపూర్, పైడిమడుగు, జోగినపెల్లి, మైతాపూర్,వద్ద రోడ్డు పైకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్న చెట్టుకొమ్మలు రెండు బస్ లు ఎదురుపడ్డపుడు వెళ్ళడానికి వీలు లేకుండా సైడు తీసుకుంటుంటే కొమ్మలు తగిలి అద్దాలు పగిలుతున్నాయి అని అధికారులు, స్థానిక నాయకులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో రోడ్డుకు అడ్డంగా పెరిగి వాహనాలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న చెట్టు కొమ్మలను ఆర్టీసీ డ్రైవర్,తిరుపతి స్వయంగా కత్తితో కొట్టి తొలగించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలాకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు,నాయకులకు ఎన్నిసార్లు చెప్పిన చర్యలు తీసుకోకపోవడంతో డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొమ్మలను తొలగించడం అవసరమని భావించి ఇలా చేశాడని స్థానికులు మరియు డ్రైవర్ చెబుతున్నారు. డ్రైవర్ తీసుకున్న ఈ చర్యను కొందరు అభినందిస్తు, మరికొందరు విధుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నాయకులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డ్రైవర్లు కోరుతున్నారూ.