ఇఫ్తార్ విందుకుపిలవని స్థానిక సర్పంచ్ ని
కోనరావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది
ప్రజా వాయిస్ వేములవాడ సిరిసిల్ల
కోనారావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ ప్రతమ పౌరుడు గ్రామ సర్పంచ్ నీ ఈ ఇఫ్తార్ విందుకు పిలవకపోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది దీనికి కాంగ్రెస్ పార్టీలో విభేదాల?... లేక అధికారుల నిర్లక్ష్యమా లేక సామాజిక వర్గానికి చెందిన సర్పంచి అనా మండల కేంద్రంలో ఎవరికి వచ్చిన అధికారం వాళ్లు చెలాయిస్తూ సర్పంచ్ కి తెలియకుండా సమావేశాలు సభలు జరుపుకుంటూ స్థానిక సర్పంచును అవహేళన చేస్తున్నారని స్థానికంగా ప్రజలనుకుంటున్నారు దీనికి క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదీ శ్రీనివాస్ చొరవ చూపి పార్టీ కార్యకర్తలలో విభేదాలు రాకుండా చూసుకొని పార్టీ కార్యకర్తలఅందరిని నాయకులను సమానమైన భావనతో మెదలాలని ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యల పట్ల అందరూ సమానమైన బాధ్యతలను నిర్వర్తించాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలలో విబెధాలు వస్తున్నాయని పార్టీనీ వీడి వేరే పార్టీలోకి వలస వెళ్లడానికి ప్రయత్నం జరుగుతున్నాయని కొందరు చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా పార్టీ కార్యకర్తల పట్ల నాయకుల పట్ల శ్రద్ధ వహించాలని మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్థం చేసుకొని స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరుకుంటున్నారు